Monday, April 27, 2020

dear english medium I  BA students,

please practice the graph given below....law of variable proportions....keep on giving your feedback and follow our whatsapp group updates.

please add more phone numbers of your friends to help all...good luck

srinivas, economics lecturer

Friday, April 24, 2020

ప్రశ్న

విస్తరణ మార్గము అనగా నేమి వ్యవసాయ రంగంలో దీని ప్రాధాన్యత వివరించండి
  సమాధానం
వ్యవసాయ రంగంలో సాధారణంగా మూలధనము శ్రామికులు అనే ఉత్పత్తి కారకాలను ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది అయితే వివిధ స్థాయిల్లోని రైతుల వద్ద ఉండే పెట్టుబడి అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ఎలా అనేది ప్రధాన సమస్య అవుతుంది 

ఉదాహరణకు ఒక పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు ఎంతమంది కూలి వాళ్లను పనిలో పెట్టుకోవాలి ఎన్ని ట్రాక్టర్ లను ఉపయోగించాలి కొత్త రకాలైన యంత్ర పరికరాలను ఎన్ని తీసుకుని రావాలి మొదలైనవి ప్రధాన సమస్యలు అవుతాయి
ఎరువులు పురుగుమందులు వాడకం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మొదలైన వాటి మధ్య ఖర్చులను లాభాలను అంచనా వేయగలగాలి
సోలార్ పంప్ సెట్ లు డ్రిప్ ఇరిగేషన్ మొదలైన ఆధునిక పద్ధతులు రుణ సదుపాయాలు పెట్టుబడి అవకాశాలు మార్కెట్లో రాగలిగే లాభము మొదలైన వాటిని అంచనా వేయడానికి విస్తరణ మార్గము దోహదపడుతుంది.
ముఖ్యంగా వాణిజ్య పంటలు కాంట్రాక్టు ఫార్మింగ్ తోట పంటలు ఫుడ్ పార్కులు ఎగుమతుల్లో వ్యాపారాలు  బారి ఎత్తున చేసే వ్యవసాయం మొదలైన చోట   వ్యవసాయి దారులు  విస్తరణ మార్గం ను ఉపయోగిస్తారు
1  అభిలషణీయం గా ఉండే వివిధ ఉత్పత్తి కారకాల  సముదాయాల సమతౌల్య బిందువులను  కలపగా  ఏర్పడే రేఖను విస్తరణ మార్గము ఎక్స్పాన్షన్ పాత్ అంటాము
2  వ్యవసాయ దారుల వద్ద ఉండే పరిమితమైన ఆదాయం ఉపయోగించి ఉత్పత్తి కారకాలైన శ్రామికులను  వేరు వేరు సముదాయాలు పొందగలుగుతాడు ఇటువంటి సముదాయాలను అన్నింటినీ  కలపగా ఏర్పడే రేఖను సమ వ్యయ రేఖ
అంటాము
3 సమానమైన ఉత్పత్తిని ఇచ్చే వివిధ ఉత్పత్తి కారకాల సముదాయ బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను సమ ఉత్పత్తి రేఖ  అంటాము
4.   సమ  వ్యయమురేఖ సమ ఉత్పత్తి రేఖ  ఎక్కడైతే tangent గా  తాకుతూ ఉంటాయో  దాన్ని సమతౌల్య బిందు వు అంటాము  ఇది ఒక స్థాయి ఉత్పత్తిని సూచిస్తుంది  పటంలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొద్దీ ఎక్కువ స్థాయిలో ఉండే ఉత్పత్తిని గమనించగలము
5 ఉత్పత్తి స్థాయి పెరిగే కొద్దీ పైన పేర్కొన్న వివిధ సమతౌల్య బిందువులను కలపగా ఏర్పడే రేఖ ను విస్తరణ మార్గము అని అంటాము

Thursday, April 23, 2020

మీరు సెల్  ఫోన్ లో ఈ పి పి టి ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దీని నుండి వినవచ్చు
ప్రియమైన విద్యార్థులారా
ఈ క్రింద లింక్ లో ఇచ్చిన  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూసేటప్పుడు వినచ్చు కూడా.....

ప్రస్తుతం కొత్త ppt ఇక్కడ ఇచ్చాను అయితే ఇదివరలో ఇచ్చిన వీడియో క్లాసు లో చెప్పిన  మూడవ సంవత్సరం బిఏ విద్యార్థులకు 10 మార్కుల ముఖ్యమైన ప్రశ్న మళ్లీ ఇంకో రూపంలో ఇవ్వడం జరిగింది
ప్రస్తుతం క్లాసులు  వీడియోల రూపంలో ఆడియో ల రూపంలో పి పి టి ల రూపంలో మాట్లాడే పి పి టీ ల రూపంలో వెబ్ సైట్ ల రూపంలో లింకుల రూపంలో వాట్సప్ గ్రూపులలో మరియు ఇతర అవకాశాల ద్వారా తెలుగు భాషలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను 

మీ అవసరాలను కామెంట్ రూపంలో ఆడియో రూపంలో మాకు పంపించండి


https://www.slideshare.net/srinivasarao223/3-ba-economics-telugu-10-marks-question-csts-gk-jangareddigudem

Thursday, April 9, 2020

ప్రియమైన విద్యార్థులారా,

మన నన్నయ్య యూనివర్సిటీ వారు,      కరోనా వల్ల మీలో ఎవరికైనా,  ఏదైనా మానసిక సమస్య , భయము ఉంటె వారికి  ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు అని తెలియచేస్తున్నారు ...కావున అవసరం ఐతే కింద ఇచ్చిన ఫోన్ నంబర్స్ కి ఫోన్ చెయ్యండి ....ధైర్యంగా ఉండి బాగా చదువుకోండి.. ఈ బ్లాగ్ గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చెయ్యండి లేదా మెయిల్ చెయ్యండి ...... 

Monday, April 6, 2020

ప్రియమైన విద్యార్థులారా,

 ఎలా ఉన్నారు. ... కరోనా ప్రభావం వల్ల మన కళాశాల పని చేయడం లేదు ...  పరీక్షలు వాయిదా పడ్డాయి .... అందువల్ల, ఆన్లైన్లో మీకు ఉపయోగపడేలా కొన్ని వెబ్ సైట్స్ ఇక్కడ ఇస్తున్నాను..  ముందు ముందు, ఈ వెబ్ సైట్స్ మరియు వీడియోస్, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మొదలైన వాటి ద్వారా ఉపయోగపడే విషయాలు తెలుసుకుందాము   ...  





http://aknu.edu.in/

please check for all updates regarding your exams, syllabus etc., 

Thursday, April 2, 2020


hi  all

  you can download    JEEVANA   part of the prajasakthi news paper and view my opinion on KARONA from the below link
HI,  DEAR STUDENTS,

  welcome once again to CSTS ECONOMICS JOURNEY. 

hope you all are doing well and happy.   please don't worry much about karona effect.  be brave and optimistic. 

  here are some useful material for your further preparation. 

  please be in touch for both academic and competitive updates.